- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సైతం వదలని చిన్మయి.. షాకింగ్ పోస్ట్ వైరల్
తమిళ లిరిసిస్ట్ వైరముత్తు జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక కావడంపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ, సినిమా: తమిళ లిరిసిస్ట్ వైరముత్తు జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక కావడంపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వైరముత్తుపై ఉన్న ‘మీటూ’ ఆరోపణల నేపథ్యంలో జూరీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైరముత్తుపై గతంలో సుమారు 17 మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ముందుండి పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక కావడంపై వస్తున్న ప్రశంసలపై సైతం ఆమె గొంతు విప్పుతున్నారు. ఇప్పటికే వైరమత్తుకు శుభాకాంక్షలు తెలిపిన రజినీకాంత్, కమల్ హాసన్‌పై షాకింగ్ కామెంట్స్ చేయగా.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వదల్లేదు చిన్మయి.
తమిళ లిరిసిస్ట్ వైరముత్తుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ X వేదికగా శుభాకాంక్షలు తెలపడంపై సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘గౌరవపూర్వకంగానే చెబుతున్నాను.. వైరముత్తు అసలు నైజం పవన్ కల్యాణ్ గారికి తెలిసి ఉండదు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకోవడం సరికాదు. ఈ విషయాన్ని పవన్ గారి కార్యాలయ సిబ్బంది ఆయన దృష్టికి తీసుకెళ్లాలి. కేవలం సినిమాల్లో పాటలు రాసే వ్యక్తిని రాజకీయ నాయకులు ఎందుకు ఇలా ఆకాశానికెత్తుతున్నారో అర్థం కావడం లేదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.






