- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ 2 సినిమాపై చిలుకూరి బాలాజీ అర్చకులు రంగరాజన్ రివ్యూ
బాలయ్య హీరోగా నటించిన అఖండ 2 సినిమాను ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ వీక్షించారు. అనంతరం థియేటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: బాలయ్య హీరోగా నటించిన అఖండ 2 సినిమాను ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ వీక్షించారు. అనంతరం థియేటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమాలో ధర్మం గురించి అద్భుతంగా చూపించారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని చెప్పారు. సినిమాలో లాజిక్, మ్యాజిక్ రెండూ ఉన్నాయని అన్నారు. సీటులో నుండి కదలకుండా సినిమా చూశానని అన్నారు. భగవంతుడు ఉన్నాడా.. ఉంటే ఇంత అరాచకానని సహిస్తూ ఉంటాడా అనేది ప్రతి ఒక్కరిలో ఉండే ప్రశ్న అని, ప్రపంచంలో మిగతాా చోట్ల అర్థ, కామం కోసమే జీవిస్తారని అన్నారు.
కానీ భారతదేశంలో మాత్రం ధర్మ, అర్థ, కామ, మోక్షాల కోసం జీవిస్తారని చెప్పారు. మన గడ్డపై ధర్మమే ముఖ్య భూమిక పోషిస్తుందని వ్యాఖ్యానించారు. ధర్మం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంటుందో అప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తాడన్నారు. తన ధర్మాన్ని రక్షించుకుంటాడన్నారు. ఇదే ఇతివృత్తం అఖండ 2లో చూపించారన్నారు. గుడి అనేది భక్తులకు చెందిన సన్నిధి అనే తమ తండ్రి మాటలు సినిమా చూసిన తరవాత గుర్తు వచ్చాయన్నారు. సినిమాలోని బాలయ్య డైలాగులు తమ తండ్రిని గుర్తు చేశాయని చెప్పారు. డైలాగ్ రైటర్ ను అభినందించాలని వ్యాఖ్యానించారు. సినిమా గురించి మాట్లాడితే గంటసేపు చెప్పవచ్చని.. గట్టిగా ఐదు నిమిషాలు కూడా కూర్చుని రాయలేని పనికిమాలినవాళ్లు ఇచ్చే రివ్యూలు పట్టించుకోనవసరంలేదన్నారు. ఎవరో ఎందుకు చెప్పాలి.. సినిమా మీరే చూసి రివ్వ్యూ చెప్పండని అన్నారు.






