ఒకే ఫ్రేమ్ లో రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్..వీడియో అదుర్స్‌

by velandi.Saikiran |   (  Updated:2026-03-06 21:35:35  IST  )

సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ పక్క పక్కనే కూర్చొని షేక్ హ్యాండ్ ఇస్తూ సరదాగా మాట్లాడుకున్నారు.

ఒకే ఫ్రేమ్ లో రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్..వీడియో అదుర్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే వేదికపై మరోసారి మెరిశారు. అంతేకాదు పక్క పక్కనే కూర్చుని, సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ( Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ వివాహం తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. బంధు మిత్రులు, కుటుంబ సమక్షంలోనే అల్లు శిరీష్-నయనిక వివాహం జరిగింది.

అల్లు అర్జున్ తో స‌ర‌ద‌గా సీఎం రేవంత్

ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. హైదరాబాద్ లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్ వేదికగా ఈ వివాహ వేడుక జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) కూడా ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త జంటకు పుష్పగుచ్చం ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత నూతన వధూవరులు, సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ తదితరులు కలిసి ఫోటో దిగారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ పక్క పక్కనే కూర్చొని షేక్ హ్యాండ్ ఇస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. కాగా పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన రోజు తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించింది. ఈ కేసులో అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పటి నుంచి వీళ్ళ మధ్య గ్యాప్ పెరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా ఈవెంట్ నేపథ్యంలో ఇద్దరు చాలా సరదాగా మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అయింది.

Next Story