- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఛావా’ సినిమా ఎఫెక్ట్.. ఆ ప్రాంతానికి పరుగులు తీస్తున్న జనాలు.. కారణం ఏంటో తెలుసా! (వీడియో)
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన్న(Rashmika Mandanna) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన్న(Rashmika Mandanna) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా(Akshaye Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయానా పెంటి, వినీత్ కుమార్ సింగ్(Vineet Kumar Singh) వంటి వారు కీలక పాత్రలో కనిపించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది.
అలాగే సినీ ప్రియులను ఆకట్టుకుంది. దీంతో ప్రేక్షకులు ‘ఛావా’ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. వారి కోరిక మేరకు టాలీవుడ్ నిర్మాత ఈ సినిమాను గీతా బ్యానర్‌పై తీసుకువచ్చి తెలుగులో మార్చి 7 విడుదల చేశారు. అయితే ఈ మూవీ ఇక్కడ కూడా బాగానే కలెక్షన్లు రాబడుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా మధ్యప్రదేశ్ ప్రజలు మొగల్ పాలకులు అప్పట్లో దాచిన బంగారం ఇంకా అక్కడే ఉందని అనుకుని అక్కడికి వెళ్లి పసిడి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొగలులు దోచుకున్న నిధిని మధ్యప్రదేశ్‌లోని అసిర్‌గఢ్ కోట సమీపంలో దాచుకున్నారని ప్రజలు అక్కడ బంగారం కోసం తవ్వుతున్నారు. బుర్హాన్పూర్‌లో ఉన్న మొగల్ కాలం నాటి బంగారాన్ని సొంతం చేసుకోవచ్చన్న ఆశతో జనాలు పరుగులు తీశారు. రాత్రి సమయంలోనూ టార్చ్ లైట్లు పెట్టుకుని మరీ జల్లెడలు, మెటల్ డిటెక్టర్లతో వెతుకుతున్నారు. బుర్హాన్‌పూర్‌ను బంగారు గనిగా ఛావా సినిమాలో చూపించినందుకు అక్కడి వారంతా ఇలా చేస్తున్నారని పలు వీడియోలను కొందరు వైరల్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు.






