చెర్రీ కూతురు జాతకం అద్భుతం.. పుట్టిన గంటల్లోనే చిరంజీవికి కోట్ల లాభం..!

by Disha Web Desk 7 |
చెర్రీ కూతురు జాతకం అద్భుతం.. పుట్టిన గంటల్లోనే చిరంజీవికి కోట్ల లాభం..!
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పాప ఉదయం 1 గంట 49 నిమిషాలకు పుట్టింది. అయితే బిడ్డ పుట్టిన గడియలు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పారు. చరణ్ కూతురిలో రాజయోగం కనిపిస్తుందని ఆయన తెలిపారు. దీంతో పాటు ఇంకో సూపర్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. మెగా మనవరాలు పుట్టిన గంటల వ్యవధిలోనే తాతా (చిరంజీవి)కి కోట్లు లాభం తెచ్చిపెట్టిందట.

జూబ్లీహిల్స్‌లో చిరంజీవి ఇంటి స్థలంపై అప్పట్లో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివాదంలో ఉన్న ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని పేర్కొందట. దీంతో చిరంజీవి ఆ స్థలాన్ని కోల్పోయారు. అయితే.. తాజాగా హైకోర్టు ఈ స్థలంపై చిరంజీవికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 595 గజాల ఈ స్థలం ప్రస్తుత ధర అక్షరాలా రూ. 30 కోట్లు పలుకుతుంది. ఇక పోయిందనుకున్న ఈ స్థలం చిరంజీవి తిరిగి పొందారు. దీంతో మెగా మనవరాలు పుట్టిన వేళ విశేషం కుటుంబంలో సంబురాలు మిన్నంటాయి.

Read more : రామ్ చరణ్ కూతురు జాతకం చెప్పిన వేణు స్వామి..ఎమన్నారో తెలుసా?

ఉపాసన డెలివరీ సమయంలో అత్త సురేఖ ఎలాంటి పని చేసిందో తెలుసా?

Next Story

Most Viewed