రిలీజ్‌కు ముందే భారీ లాభాలు.. మరో బ్లాక్ బస్టర్‌కు సిద్ధమవుతున్న యంగ్ హీరో

by Chukka Sudharani |

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’.

రిలీజ్‌కు ముందే భారీ లాభాలు.. మరో బ్లాక్ బస్టర్‌కు సిద్ధమవుతున్న యంగ్ హీరో
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ కాగా.. జులై 24న గ్రాండ్ థియేట్రికల్‌కు సిద్ధమవుతున్నది. ఇదిలా ఉంటే రిలీజ్‌కు ముందే ఈ సినిమా మునుపెన్నడూ లేని రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ‘చెన్పై లవ్ స్టోరీ’కు మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ డీల్స్ కుదిరాయి. ఆంధ్ర ఏరియా రైట్స్ ఏకంగా రూ.8 కోట్ల రేషియోలో క్లోజ్ అవ్వగా, రాయలసీమ (సీడెడ్) బిజినెస్ రూ.3 కోట్ల రేషియోలో ఫైనల్ అయింది. టాలీవుడ్‌కు గుండెకాయ లాంటి నైజాం ఏరియా రైట్స్ కూడా భారీ స్థాయిలో రూ.8 కోట్లకు అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ రూ.4 కోట్లకు డీల్ కుదిరింది. ఇందులో రూ.1 కోటి రికవరీ ఆప్షన్ కూడా ఉంది. ఈ లెక్కన కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.23 కోట్ల గ్రాండ్ టోటల్‌ను టచ్ చేసింది. మొత్తంగా ఈ సినిమా సుమారు ₹35 కోట్ల విలువైన థియేట్రికల్, నాన్-థియేట్రికల్ ఒప్పందాలను పూర్తి చేసినట్లు వార్తలు వస్తుండగా.. ఈ సినిమాపై హైప్ పెరిగిపోతుంది.

Next Story