- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నై జ్ఞాపకాలు.. కిరణ్ అబ్బవరం లవ్ స్టోరీ.. ఫొటోలు వైరల్
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మూవీ

దిశ, సినిమా : సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మూవీపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై వస్తున్న సినిమాకు.. సాయి రాజేశ్ కథను అందిస్తుండగా.. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ అందిస్తూ.. కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇళయ రాజా ఫొటో ఉన్న టేప్ రికార్డర్, ఇంద్ర సీడీ, బ్రేస్ లెట్, వాటర్ బాటిల్, పేపర్స్ నడుమ హీరోహీరోయిన్ల క్లోజ్ ఫొటో అదిరిపోయింది. సినిమా సరికొత్తగా ఉండబోతుందనే ఆసక్తిని కలిగించడంలో సక్సెస్ అయింది.






