- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూర్తైన 'చెన్నై లవ్ స్టోరీ'.. రన్‌టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
'చెన్నై లవ్ స్టోరీ' మూవీని దాదాపు మూడు గంటల నిడివితో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్రీకరణను ఇప్పటికే పూర్తిచేసిన చిత్రబృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హీరో, హీరోయిన్ ఇద్దరూ డబ్బింగ్ పనుల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. అలాగే మరోవైపు ట్రైలర్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు, మరికొద్ది రోజుల్లో దానిని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రన్‌టైమ్ విషయంలో కూడా మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల నిడివితో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ఇంకా సమయం ఉండటంతో రన్‌టైమ్‌ను తగ్గించే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది వేచి చూడాలి. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ కథను అందించగా, మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.






