Chava : ఏపీలో "చావా" విడుదల లేనట్లేనా?

by Muthe.Rajitha |   (  Updated:2025-03-06 11:19:58  IST  )

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్(Vicky Koushal) నటించిన "చావా"(Chava)ను తెలుగులో గీతా ఆర్ట్స్(Geeta Arts) బ్యానర్ పై బ‌న్నీ వాస్ రిలీజ్ చేస్తున్నారు.

Chava : ఏపీలో చావా విడుదల లేనట్లేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్(Vicky Koushal) నటించిన "చావా"(Chava)ను తెలుగులో గీతా ఆర్ట్స్(Geeta Arts) బ్యానర్ పై బ‌న్నీ వాస్ రిలీజ్ చేస్తున్నారు. మార్చి 7న రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఏపీలో ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 'ముస్లిం ఫెడరేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హాక్' ఇటీవల నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఛావా రిలీజ్‌ను ఆపాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. మెమోరాండం స‌మ‌ర్పించారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి ఛావా సినిమా తీశార‌ని మెమోరండంలో జియా ఉల్ హాక్ పేర్కొన్న‌ట్లు తెలిసింది. అలాగే, ఈ మూవీలో 16వ శతాబ్దం నాటి ఔరంగజేబుని క్రూరుడిగా చిత్రీకరించారని, అందువల్ల రిలీజ్కు ముందు నార్త్ ఇండియాలో గొడవలు జరిగాయని, ఏపీలోనూ అలాంటి మత ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపారు.

కనుక సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ జియా ఉల్‌ హకీ డిమాండ్‌ చేస్తున్నాడు. కలెక్టర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కాగా భారీ అంచనాలు, వివాదాల నడుమ "చావా" సినిమా ఫిబ్రవరి 14న హిందీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మహారాజా ఛత్రపతి శివాజీ(Chatrapathi Shivaji) పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ (Shambaji Maharaj) పాలన గురించి చిత్రీకరించబడింది. ఈ సినిమాలో శంభాజీ భార్య పాత్రలో రష్మిక మందన్న(Rashmika Mandana) నటించింది. అక్షయ్ ఖన్నా చక్రవర్తి ఔరంగజేబు పాత్రను పోషించాడు.

Next Story