Charmi: ‘నా గురించి కొంచెం కలలు కనండి’ అంటూ సీనియర్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Kodari Anjali |   (  Updated:2025-02-14 07:19:24  IST  )

సీనియర్ హీరోయిన్ చార్మి (Charmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Charmi: ‘నా గురించి కొంచెం కలలు కనండి’ అంటూ సీనియర్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ హీరోయిన్ చార్మి (Charmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ అప్పట్లో ఏకంగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఈ ముద్దుగుమ్మ నీతోడు కావాలి (Nithoḍu kavali) సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 14 ఏళ్ల వయస్సులోనే చార్మి ఈ అవకాశం పొందినప్పటికీ.. ఈ మూవీ పెద్దగా హిట్ అందుకోలేదు. అయినా ఈ నటి యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు.

తర్వాత చార్మికి వెంటనే కాదల్ కిసు కిసు(Kadal Kiss Kiss) అనే తమిళ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. కాదల్ అళివతిల్లై(Kadal Alivatillai), ఎత్న అళగు(Etna aḷagu), ఆహా అనే తమిళ సినిమాల్లో నటించింది ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత దర్శకుడు కృష్ణవంశీ ఈ హీరోయిన్‌కు శ్రీ ఆంజనేయం(Sri Anjaneyam) సినిమాలో చాన్స్ ఇచ్చాడు. వీటితో పాటు సేవకుడు(Sēvakuḍu), మనోరమ, జ్యోతిలక్ష్మీ(Jyothilaxmi), సకుటుంబ సపరివార సమేతం(Sakuṭumba saparivara sametam), మైకేల్ మదన కామరాజు(Michael Madana Kamaraju), మంత్ర, సుందరకాండ(Sundarakanda), లవ కుశ..

రాఖీ, పౌర్ణమి(Paurṇami), చిన్నోడు, లక్ష్మీ, చుక్కల్లో చంద్రుడు, అల్లరి పిడుగు(Allari piḍugu), పొలిటికర్ రౌడీ, అనుకోకుండా ఒక రోజు, మాస్, చక్రం(Cakraṁ), గౌరి, చంటి, కాట్టు చంపకం, నీకు మనసిచ్చాను, కుర్రాడొచ్చాడు (Kurraḍochaḍu) వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పంచుకుంది. ‘‘నా గురించి కొంచెం కలలు కనండి’’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చి ఓ ఫొటో పంచుకుంది. అలాగే స్టోరీలో ‘మీకు ఇష్టమైన వ్యక్తులతో వ్యక్తిగత జీవితం సంతోషకరంగా ఉంటుంది’ అని రాసుకొచ్చింది.

Next Story