యంగ్ హీరోతో చంద్రశేఖర్ యేలేటి నెక్స్ట్ మూవీ?

by Pulgam srinivas |

చంద్రశేఖర్ యేలేటి తన తదుపరి చిత్రాన్ని ప్రదీప్ రంగనాథన్ తో, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేయబోతున్నట్లు సమాచారం.

యంగ్ హీరోతో చంద్రశేఖర్ యేలేటి నెక్స్ట్ మూవీ?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వారిలో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. చివరిగా ఈ దర్శకుడు 2021లో విడుదలైన 'చెక్' చిత్రానికి దర్శకత్వం వహించారు. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం, చంద్రశేఖర్ యేలేటి ఓ యంగ్ హీరోతో తన తదుపరి చిత్రాన్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. తమిళ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ తో, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ దర్శకుడు ఒక చిత్రం చేయబోతున్నట్లు సమాచారం.

మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ మంచి ఫామ్‌లో కెరీర్ కొనసాగిస్తున్నాడు. మరోవైపు చంద్రశేఖర్ యేలేటి చిత్రాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే దానిపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story