- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో చంద్రహాస్పై కేసు నమోదు..కొంప ముంచిన 'గుంజి గుంజి' లిరిక్స్
హీరో చంద్రహాస్ పైన కేసు కూడా నమోదయింది. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ పాట వ్యవహారంలో భాగంగా హీరో చంద్రహాస్ పై కొంత మంది సామాజికవేత్తలు ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏదో ఒక మ్యాజిక్ చేసి ఇండస్ట్రీని దున్నేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కొంత మంది సక్సెస్ అవుతుంటే మరి కొంత మంది వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. అలాంటి వారిలో బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో చంద్రహాస్ ( Hero Chandrahas) ఒకరు. చంద్రహాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న చంద్రహాస్, తన ప్రతి సినిమాకు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు.
హీరో చంద్రహాస్పై కేసు నమోదు ?
ఇలాంటి నేపథ్యంలో బరాబర్ ప్రేమిస్తా ( Barabar Premistha) అనే సినిమా ఈవెంట్ సందర్భంగా పాడిన గుంజి గుంజి పాట ( Gunji Gunji song ) ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ పాట నేపథ్యంలో తాజాగా హీరో చంద్రహాస్ పైన ( Hero Chandrahas) కేసు కూడా నమోదయింది. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ పాట వ్యవహారంలో భాగంగా హీరో చంద్రహాస్ పై కొంత మంది సామాజికవేత్తలు ఫిర్యాదు చేశారు. స్టేజ్ పైన బూతు పాట పాడి అందరి మనోభావాలు దెబ్బతీశాడని ఈ కేసు పెట్టారు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అసలు ఏంటి ఈ పాట వివాదం... ఎందుకు చంద్రహాస్ పై ట్రోలింగ్
టాలీవుడ్ యువ నటుడు చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన అంటే రేపటి రోజున రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేస్తూ దూసుకు వెళ్తోంది చిత్ర బృందం. అయితే బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాదులో ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సందర్భంగా హీరో చంద్రహాస్ ఓ అదిరిపోయే పాట అందుకున్నాడు. అయితే ఇందులో కొన్ని బూతు పదాలు ఉన్నాయి.
వాస్తవానికి ఆ పాట లో ఉన్న బూతు పదాలను సినిమాలో తొలగించారట. కానీ, స్టేజ్ పైన మాత్రం బూతులతోనే పాట పాడేశాడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్. ఇప్పుడు ఇదే అంశం వివాదంగా మారింది. ఆ కార్యక్రమానికి మహిళలు, చిన్నపిల్లలు అలాగే పెద్ద యాక్టర్లు కూడా వచ్చారు. వాళ్ల సమక్షంలోనే బూతు పదాలతో ఉన్న ఆ పాటను పాడి చంద్రహాస్ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో తాజాగా అతనిపై ఓ టీవీ ఛానల్ కు సంబంధించిన ఓ జర్నలిస్టు కూడా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు ఈ పాట వివాదంపై ఇప్పటికే ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు టాలీవుడ్ యువ నటుడు చంద్రహాస్. తన పాట పట్ల ఇబ్బంది పడ్డ వారికి క్షమాపణలు చెప్పారు.






