- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రాండ్ గా నారా రోహిత్ వివాహం....హాజరైన చంద్రబాబు, లోకేశ్
నారా కుటుంబంలో పెళ్లి సందడి చోటు చేసుకుంది. తాజాగా నారా రోహిత్, శిరీష వివాహం హైదరాబాద్ నగరంలో చాలా గ్రాండ్ గా జరిగింది

దిశ, వెబ్ డెస్క్: నారా కుటుంబంలో పెళ్లి సందడి చోటు చేసుకుంది. తాజాగా నారా రోహిత్, శిరీష వివాహం హైదరాబాద్ నగరంలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా హాజరైంది. మంత్రి నారా లోకేష్ కూడా ఈ పెళ్లిలో మెరిశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ తరుణంలోనే సీఎం చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నారా రోహిత్ పెళ్లి అంటే, మా ఇంటి పండగే అని పేర్కొన్నారు. నారా రోహిత్, శిరీషల వివాహం అంగరంగ వైభవంగా చేసినట్లు తెలిపారు.
నారా వారి ఆహ్వానం మేరకు పెళ్లికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇది ఇలా ఉండగా ప్రతి నిధి-2 సినిమాలో రోహిత్ సరసన శిరీష హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సందర్భంగా ఈ ఇద్దరు మధ్య ప్రేమ చిగురించింది. ఇక వీళ్ళ పెళ్లికి పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో తాజాగా పెళ్లి జరిగింది. శిరీష స్వస్థలం ఏపీలోని రెంటచింతల. వాళ్ల తల్లిదండ్రులకు నాలుగో సంతానంగా జన్మించిన శిరీష, ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివారు. అక్కడ కొన్ని రోజులు ఉద్యోగం కూడా చేశారని సమాచారం. అయితే సినిమాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ తో ఇండియాకు వచ్చి ప్రతినిధి 2 సినిమా కూడా చేశారు.






