- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandini Chowdhury: పెళ్లి కూతురిగా చాందినీ చౌదరి.. ఆకట్టుకుంటోన్న లుక్
కలర్ ఫొటో, గామి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ చాందినీ చౌదరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు’.

దిశ, సినిమా: కలర్ ఫొటో, గామి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ చాందినీ చౌదరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు’. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కల్యాణి ఓరుగంటి అనే పాత్రలో చాందినీ ఆకట్టుకోనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ హీరోయిన్ బర్త్‌డే కావడంతో.. సంతాన ప్రాప్తిరస్తు నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందంజ పెళ్లి కూతురిగా ముస్తాభైన చాందినీ స్టిల్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగా.. ఇందులో విక్రాంత్ హీరోగా నటిస్తుండగా.. మధుర ఎంటర్‌టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.






