అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్న చైతన్య-శోభిత.. ఫొటోలు వైరల్

by I. Sairam |   (  Updated:2026-02-12 10:33:19  IST  )

చైతన్య-శోభిత సంక్రాంతి సంబరాలను అన్నపూర్ణ స్టూడియోలో సెలబ్రేట్ చేసుకున్నారు. మంచి ట్రెడిషనల్ వేర్‌లో ఈ జంట అక్కడ ఉన్న అందరికీ అన్నం వడ్డిస్తూ కనిపించారు.

అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్న చైతన్య-శోభిత.. ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)- శోభిత ధూళిపాళ(Shobhitha Dulipala) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రెండేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట, 2024 డిసెంబర్‌ 4న ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ జంట నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తమ వెకేషన్స్ ఫొటోస్, ఫంక్షన్స్‌కు వెళ్తున్న ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటున్నారు.

ఇక ప్రజెంట్ నాగ చైతన్య కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ‘ఎన్‌సీ-24’(NC-24) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక హీరోయిన్ శోభిత ‘చీకటిలో’(Chikatilo) అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీ జనవరి 23 నుంచి డైరెక్టర్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా చైతన్య-శోభిత సంక్రాంతి సంబరాలను అన్నపూర్ణ స్టూడియోలో సెలబ్రేట్ చేసుకున్నారు. మంచి ట్రెడిషనల్ వేర్‌లో ఈ జంట అక్కడ ఉన్న అందరికీ అన్నం వడ్డిస్తూ కనిపించారు. అలాగే అక్కడ ఉన్న వారితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బ్యూటిపుల్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.



Next Story