త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న చైతన్య- శోభిత పెళ్లి డాక్యుమెంటరీ.. వైరల్ అవుతున్న ట్వీట్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-02-03 11:47:10  IST  )

టాలీవుడ్ హీరో నాగ చైతన్య(Naga chaitanya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న చైతన్య- శోభిత పెళ్లి డాక్యుమెంటరీ.. వైరల్ అవుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నాగ చైతన్య(Naga chaitanya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా ‘తండేల్’(Thandel) మూవీలో నటిస్తున్నారు. చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌(Geeth Arts Banner)పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. యథార్థ ప్రేమ సంఘటన కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం లవర్స్ కానుకగా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. హీరోయిన్ సమంత(Samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య.. కలిసి ఉండలేక 4 సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. ఇక డివోర్స్ తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhita Dhulupala)తో డేటింగ్‌లో ఉంటూ వేకెషన్స్, హోటల్స్‌కి తిరగసాగడు. ఫైనల్‌గా గతేడాది ఆగస్టు 8న కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చాడు. ఈ విషయం స్వయంగా నాగార్జున ఎక్స్ వేదికగా వెల్లడించడంతో ఆ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎంగేజ్‌మెంట్‌(Engagement)ని ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్‌గా చేసుకున్న చైతన్య.. డిసెంబర్ 4న పెళ్లి మాత్రం అన్నపూర్ణ స్టూడియో(Annapurna)లో అంగరంగ వైభవంగా చేసుకున్నాడు.

వీరి వివాహ వేడుకకు చాలా మంది సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. ప్రస్తుతం ఈ జంట మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. చైతన్య- శోభిత పెళ్లి డాక్యుమెంటరీ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌(Net Flix)లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రముఖ సంస్థ ఏకంగా రూ.50 కోట్లతో ఈ డాక్యుమెంటరీ హక్కులు పొందినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click Here Tweet..

Next Story