‘చాయ్ షాట్స్’ ఓటీటీ లాంచ్.. కంటెంట్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్

by Sujitha Rachapalli |

'చాయ్ షాట్స్' కంటెంట్, క్రియేటర్స్ సినిమాల మాదిరిగానే పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు హీరో, ప్రొడ్యూసర్ దగ్గుబాటి రానా. చాయ్ షాట్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లాంచింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. భారతదేశంలో తొలి రీజినల్ షార్ట్-సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌గా రికార్డ్ క్రియేట్ చేయబోతుందన్నారు. తెలుగు డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌కి

‘చాయ్ షాట్స్’ ఓటీటీ లాంచ్.. కంటెంట్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్
X

దిశ, సినిమా : 'చాయ్ షాట్స్' కంటెంట్, క్రియేటర్స్ సినిమాల మాదిరిగానే పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు హీరో, ప్రొడ్యూసర్ దగ్గుబాటి రానా. చాయ్ షాట్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లాంచింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. భారతదేశంలో తొలి రీజినల్ షార్ట్-సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌గా రికార్డ్ క్రియేట్ చేయబోతుందన్నారు. తెలుగు డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌కి పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్న చాయ్ బిస్కెట్..స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్’లో రెండు నిమిషాలలోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉండనున్నాయి. Info Edge Ventures, General Catalyst మద్దతుతో రూపుదిద్దుకున్న చాయ్ షాట్స్.. ఎండ్ లెస్ స్క్రోలింగ్‌ నుంచి స్ట్రక్చర్డ్, హై క్వాలిటీ కథలు, ఎంటర్‌టైన్మెంట్ వైపు ప్రేక్షకులను తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. క్రియేటర్ల కోసం బిగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. 1. క్రియేటర్ గేట్‌వే.. మధ్యవర్తులు లేకుండా నేరుగా కథలు పిచ్ చేసుకునే పోర్టల్. 2. ₹20 కోట్ల క్రియేటర్ ఫండ్.. రాబోయే ఆరు నెలల్లో 200+ క్రియేటర్లతో కలిసి ఒరిజినల్ షోస్ రూపొందించేందుకు భారీ పెట్టుబడి. మొత్తానికి కొత్త రైటర్స్, డైరెక్టర్స్, నటులు ఎదగడానికి పెద్ద వేదికగా మారనుంది. ఇక ఏంజెల్ ఇన్వెస్టర్లలో రానా దగ్గుబాటి (నటుడు, నిర్మాత), శ్రీ హర్ష మజేటి & నందన్ రెడ్డి (స్విగ్గీ వ్యవస్థాపకులు), ఫణీంద్ర సమా (రెడ్‌బస్ స్థాపకుడు), అలఖ్ పాండే & ప్రత్యీక్ మహేశ్వరి (ఫిజిక్స్‌వాలా వ్యవస్థాపకులు), అరవింద్ సాంకా, పవన్ గుంటుపల్లి, రిషికేశ్ SR (రాపిడో స్థాపకులు), రోహిత్ చెన్నమనేని (డార్విన్‌బాక్స్ సహ వ్యవస్థాపకుడు), అమర్ నగరం (విర్జియో వ్యవస్థాపకుడు) ఉన్నారు.

Next Story