- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CHAAVA: ‘చావా’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. మహారాణి లుక్‌లో ఆకట్టుకుంటున్న స్టార్ హీరోయిన్ (పోస్ట్)
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna), బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చావా’(Chaava).

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna), బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చావా’(Chaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మిస్తున్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని మూవీ పై మరింత హైప్ పెంచేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ టీజర్‌ను రిలీజ్ చేస్తూ.. “అగ్ని భీ హో, పానీ భీ హో, తుఫాను భీ హో, షేర్ శివాకా నీడ ‘చావా’” అంటూ అదిరిపోయే క్యాప్షన్ జోడిస్తూ.. ఈ మూవీ ట్రైలర్ జనవరి 22న రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. అలాగే హీరోయిన్ రష్మిక మందన్న లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. అందులో మహారాణి ఏసు బాయి పాత్రలో నేషనల్ క్రష్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






