సెన్సార్ పూర్తి చేసుకున్న బ్యాండ్ మేళం

by Pulgam srinivas |   (  Updated:2026-03-14 10:42:10  IST  )

బ్యాండ్ మేళం మూవీకి సెన్సార్ బోర్డు నుండి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది

సెన్సార్ పూర్తి చేసుకున్న బ్యాండ్ మేళం
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ జోడీ రోషన్-శ్రీదేవి జంటగా రూపొందిన చిత్రం బ్యాండ్ మేళం. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. మార్చ్ 26న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదలకు చాలా రోజుల ముందు నుంచే రోషన్, శ్రీదేవి, కోన వెంకట్ పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు బాగుండడంతో 'బ్యాండ్ మేళం'పై యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇదివరకే రోషన్-శ్రీదేవి జంటగా రూపొందిన కోర్టు మూవీ మంచి విజయం సాధించింది. అందులో ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగుండడంతో ఈ చిత్రానికి అది అదనపు బలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే రీసెంట్ టైంలో చూసినట్లయితే లవ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో రోషన్-శ్రీదేవి జంటగా రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.




Next Story