- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాడ్ గర్ల్‌కు రూటు క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే..
ఈ ఏడాది ప్రారంభంలో కుల వ్యవస్థ, లింగ సంబంధ విషయాలపై వివాదాలకు కారణమైన తమిళ సినిమా బ్యాడ్ గర్ల్ (Bad Girl Movie)కు తాజాగా సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్ లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ప్రారంభంలో కుల వ్యవస్థ, లింగ సంబంధ విషయాలపై వివాదాలకు కారణమైన తమిళ సినిమా బ్యాడ్ గర్ల్ (Bad Girl Movie)కు తాజాగా సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్ లభించింది. వర్ష భరత్ దర్శకత్వంలో రూపొందిన ఈ కామింగ్-ఆఫ్-ఏజ్ డ్రామాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) యూఏ సర్టిఫికెట్ మంజూరు చేసింది. సెన్సార్ క్లియర్ అవ్వడంతో ఈ సినిమాను సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అదే రోజున విడుదలయ్యే శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మద్రాసితో బాక్సాఫీస్ వద్ద బ్యాడ్ గర్ల్ పోటీ పడనుంది.
వెట్రిమారన్ నిర్మాణంలో.. అనురాగ్ కశ్యప్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం, ఈ ఏడాది జనవరిలో టీజర్ విడుదలైన వెంటనే దుమారం రేపింది. ముఖ్యంగా యువతి ధూమపానం, మద్యం చేసే సీన్స్, బ్రాహ్మణుల జీవితాన్ని చూపించిన తీరు కొన్నివర్గాల నిరసనకు కారణమయ్యాయి. జనవరి 29న ప్రముఖ నటి శాంతి ప్రియా X వేదికగా స్పందిస్తూ.. “ఈ సినిమా ఎవరినైనా గాయపరిచే ఉద్దేశంతో రూపొందించలేదు. అన్ని వర్గాల్లోని వ్యక్తుల జీవితాల్లోని సవాళ్లను చూపిస్తూ, అర్థం చేసుకునే దిశగా చర్చ ప్రారంభించడమే మా లక్ష్యం. బ్రాహ్మణుల జీవితాన్ని చూపించడం అనేది విమర్శ కాదు, అది వాస్తవికతతో కూడిన కథా పరిచయం మాత్రమే” అని తెలిపారు.
ఇంతవరకు బ్యాడ్ గర్ల్ సినిమాకు పలుచోట్ల ప్రశంసలు దక్కాయి. నెదర్లాండ్స్‌లోని రొటర్‌డామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బెస్ట్ ఏషియన్ ఫిల్మ్’ కేటగిరీలో ‘నెట్‌పాక్ అవార్డ్’ను గెలుచుకుంది. స్పెయిన్‌లో జరిగిన సినిమా జోవ్-వాలెన్షియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘యంగ్ జ్యూరీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ కూడా అందుకుంది. త్వరలో ఇటలీలోని కరవాన్ ఫెస్ట్, పోలాండ్‌లోని న్యూ హరైజన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ఈ చిత్రం ప్రదర్శన జరగనుంది. అంజలి శివరామన్, శాంతి ప్రియా, హ్రిధు హారూన్, టీజే అరుణాసలం, శశాంక్ బొమ్మిరెడ్డిపల్లి, సరన్యా రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ప్రీత జయరామన్, జగదీశ్ రవి, ప్రిన్స్ ఆండర్సన్ సినిమాటోగ్రఫీ అందించగా, రాధా శ్రీధర్ ఎడిటింగ్ చేశారు. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది బాణీలు అందించగా, వినోత్ తనిగసాలం సౌండ్ డిజైన్, హరి హర సుతన్ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు నిర్వహించారు.






