సెలబ్రేషన్స్ స్టార్ట్.. ఫైరింగ్ పోస్టర్‌తో ‘సెయాన్’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-18 05:32:13  IST  )

ఈ పోస్ట్‌కు "ఒకే దార్శనికత... ఒకే ప్రయాణం సెయాన్ బిగిన్స్ సెలబ్రేషన్స్ స్టార్ట్" అంటూ ఒక పవర్‌ఫుల్ క్యాప్షన్‌ను కూడా జోడించారు.

సెలబ్రేషన్స్ స్టార్ట్.. ఫైరింగ్ పోస్టర్‌తో ‘సెయాన్’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అమరన్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సెయాన్’. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్‌కు చెందిన సొంత నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్‌పై శివకార్తీకేయన్ చేస్తున్న రెండో సినిమా కావడం విశేషం. దీంతో ఈ ప్రాజెక్ట్ పైనప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైనట్లు నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఈ పోస్ట్‌కు "ఒకే దార్శనికత... ఒకే ప్రయాణం సెయాన్ బిగిన్స్ సెలబ్రేషన్స్ స్టార్ట్" అంటూ ఒక పవర్‌ఫుల్ క్యాప్షన్‌ను కూడా జోడించారు. అలాగే శివకార్తీకేయన్ చేతిలో కాగడ పట్టుకుని, ఎంతో కోపంగా చూస్తున్న ఒక ఊరమాస్ పోస్టర్‌ను కూడా విడుదల చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పల్లెటూరి వాతావరణంలో జరిగే కథ కావడంతో, ఇందులో అద్భుతమైన కుటుంబ భావోద్వేగాలతో పాటు, ప్రేక్షకులను ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్, వినోదాన్ని సమానంగా మేళవిస్తున్నారట. ఇందులో శివకార్తీకేయన్ మునుపెన్నడూ చూడని ఒక కరుడుగట్టిన మాస్ అవతారంలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన సరసన టాలీవుడ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొడుకును చూశారా?

Next Story