- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొడుకును చూశారా?
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొడుకు ఎయిర్ పోర్టులో కనిపించగా, వీడియో వైరల్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంత మంది మాత్రమే బాగా పాపులర్ అవుతూ ఉంటారు. బడా హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తూ ఉంటారు. అలాంటి వారిలో తమన్ ఒకరు. ఎస్. ఎస్ తమన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ అగ్ర హీరోలతో నిత్యం సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన ఏ సినిమా చేసినా, బంపర్ హిట్ అవుతూనే ఉంది. అయితే అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా తన కుమారుడితో కలిసి మెరిశారు.
విమానాశ్రయం నుంచి ఇద్దరు బయటకు వస్తూ కెమెరాలకు చిక్కారు. దీంతో వీడియో వైరల్ గా మారింది. గత నాలుగు సంవత్సరాల కిందట తమన్ ఏకైక కొడుకు అచ్యుత్ పదవ తరగతి పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతున్నట్లు తెలుస్తోంది. అచ్యుత్ కు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని స్వయంగా తమన్ చాలా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమన్ చేసిన ప్రతి పాట మొదటగా అచ్యుత్ మాత్రమే వింటారట. ఇది ఇలా ఉండగా ప్లే బ్యాక్ సింగర్ శ్రీ వర్దిని తమన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.






