- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దర్శకుడు, హీరోతో కేథరిన్ మాస్ స్టెప్పులు
ఇళయ దళపతి విజయ్ కొడుకు జాసన్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రానికి భారీ హైప్ నెలకొంది. ఈ మూవీ చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తి కాగా ఓ పాట మాత్రం బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది

దిశ, సినిమా : ఇళయ దళపతి విజయ్ కొడుకు జాసన్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రానికి భారీ హైప్ నెలకొంది. ఈ మూవీ చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తి కాగా ఓ పాట మాత్రం బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పాట షూటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ డ్యాన్స్ నంబర్‌లో కేథరిన్ ట్రెసా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్. జాసన్ సంజయ్ కూడా ఈ పాటలో కనిపించబోతున్నాడని.. సాంగ్ సినిమాకు చాలా ప్లస్ అవుతుందని టాక్. సందీప్ కిషన్, జాసన్ సంజయ్ వేసే స్టెప్పులతో థియేటర్లు దద్దరిల్లబోతున్నాయని.. ప్రమోషన్స్‌కు కూడా ఈ పాటనే వినియోగించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం సందీప్ కిషన్‌ను పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా చూపించబోతుంది. పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టబోతుంది. లైకా ప్రొడక్షన్ నిర్మాణ సారథ్యంలో రాబోతున్న మూవీలో ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.






