క్యారవాన్‌లో అమ్మాయిలతో సెక్స్, డ్రగ్స్.. ఏళ్లుగా సాగుతున్న స్టార్ హీరో రాసలీలలు.. ఇండస్ట్రీలో దుమారం

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-29 05:36:04  IST  )

స్టార్ హీరో విజయ్ సేతుపతిపై ఓ అమ్మాయి చేసిన సంచలన ఆరోపణలు కోలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగం, కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడినట్లు హీరోపై

క్యారవాన్‌లో అమ్మాయిలతో సెక్స్, డ్రగ్స్.. ఏళ్లుగా సాగుతున్న స్టార్ హీరో రాసలీలలు.. ఇండస్ట్రీలో దుమారం
X

దిశ, వెబ్ డెస్క్ : స్టార్ హీరోపై ఓ అమ్మాయి చేసిన సంచలన ఆరోపణలు కోలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగం, కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడినట్లు హీరోపై వచ్చిన అలిగేషన్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. రమ్య మోహన్ అనే అమ్మాయి చేసిన పోస్ట్‌ ద్వారా వచ్చిన ఆరోపణలు వైరల్ అవుతుండగా.. ‘కారవాన్ ఫేవర్స్’ కోసం రూ. 2 లక్షలు, ‘డ్రైవ్స్’ కోసం రూ. 50వేలు పెద్ద మొత్తాలను ఆఫర్ చేశాడని ఆరోపించింది.

ప్రస్తుతం రిహబిలేషన్ సెంటర్‌లో ఉన్న తనకు తెలిసిన అమ్మాయిని పరిశ్రమ నిబంధనల ముసుగులో సంవత్సరాలుగా వాడుకున్నారని రమ్య ఆరోపించింది. హీరోను నేరుగా ట్యాగ్ చేసిన అమ్మాయి.. తమిళ చిత్ర పరిశ్రమలో లోతుగా పాతుకుపోయిన మాదకద్రవ్య దుర్వినియోగం, లైంగిక సంబంధాల గురించి తీవ్ర ఆరోపణలు చేసింది. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుందని విమర్శించింది. అయితే ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో మొదటి ట్వీట్ డిలీట్ చేసింది. కానీ ఇది నిజమే అయితే నిర్భయంగా చెప్పొచ్చని కామెంట్స్ చేస్తున్నారు జనాలు. అయితే ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే స్టార్ హీరో స్పందిస్తేనే తెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.

మరో వివాదంలో నటి కల్పిక

Next Story