మరో వివాదంలో నటి కల్పిక

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-29 05:01:43  IST  )

టాలీవుడ్ నటి కల్పిక గణేష్ (Kalpika ganesh) మరో సారి వివాదంలో చిక్కుకున్నారు.

మరో వివాదంలో నటి కల్పిక
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ (Kalpika ganesh) ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా పబ్‌కు వెళ్లిన ఆమె అక్కడి సిబ్బందితో గొడవపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ గొడవకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట రచ్చ చేశాయి. ఆ సంగతి ఇంకా సద్దుమణగకముందే.. తాజాగా కల్పిక మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్- కనక మామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె హంగామా సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే?

కల్పిక జులై 28న మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్యాబ్లో ఒంటరిగా బ్రౌన్ టౌన్ రిసార్ట్‌కు వెళ్ళింది. అక్కడ రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే అక్కడి మేనేజర్ కృష్ణతో చాలా దురుసుగా ప్రవర్తించింది. ఒక్కసారిగా మెనూ కార్డను విసిరివేయడం, రూమ్ కీస్‌ను మేనేజర్ ముఖం పైనే విసిరి కొట్టడం అలాగే మేనేజర్‌తో అసభ్యకరంగా బూతులు మాట్లాడడం వంటివి చేసింది. ఈ షాకింగ్ ఘటనతో రిసార్టులోని సిబ్బంది కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు రిసార్ట్ ప్రాంగణంలో న్యూసెన్స్ క్రియేట్ చేసింది. ఈ దృశ్యాలను అక్కడ ఉన్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. వీడియోలో కల్పిక బూతులతో రెచ్చిపోవ్వటం చూసి పలువురు నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రిసార్ట్ వివాదంపై స్పందించిన కల్పిక

ఇక ఈ వివాదంపై నటి కల్పిన తన ఇన్‌స్టాగ్రామ్ వేదిక క్లారిటీ ఇచ్చింది. రిసార్ట్‌లోని సిబ్బంది అనవసరంగా తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించింది. వేరే కేసు విషయంలో పోలీసులు తనను వేధిస్తున్నారని, ఆ ఓదార్పు కోసం రిసార్ట్‌కి వెళ్తే అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు అక్కడ తను ఎలాంటి హంగామా చేయలేదని తెలిపింది. 'వారే నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. అక్కడ వైఫై పని చేయడం లేదు.. క్యాబ్ సదుపాయం లేదు. కనీసం సిగరెట్టు తీసుకురమ్మని చెప్పినా ఎవరు వినలేదు. నా కనీస అవసరాలపై బాధ్యత చూపించలేదు. బాధతో తట్టుకోలేక బూతులు తిట్టాను. కానీ వారు మాత్రం నన్ను సరిగా అర్థం చేసుకోలేదు' అంటూ చెప్పుకొచ్చింది.

Next Story