సీఎంతో పవన్ కీలక సమావేశం.. సాయికృష్ణ లాకప్ డెత్‌ ఆరోపణలపై డీజీపీ వివరణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-17 13:04:21  IST  )

ఏపీ సీఎం చంద్రబాబుతో అమరావతి సెక్రటేరియట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు. గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి లాకప్ డెత్ విమర్శలు, ఆరోపణలపై సీరియస్‌గా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది....

సీఎంతో పవన్ కీలక సమావేశం.. సాయికృష్ణ లాకప్ డెత్‌ ఆరోపణలపై డీజీపీ వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu Naidu)తో అమరావతి సెక్రటేరియట్‌(Amaravati Secretariat)లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) సమావేశం నిర్వహించారు. గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి లాకప్ డెత్ విమర్శలు, ఆరోపణలపై సీరియస్‌గా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమావేశంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సైతం హాజరయ్యారు. ఆయన్ను కూడా వివరణ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఆరోపణలు రావడంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐను వీఆర్‌కు పంపడ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది.

పోలీసులే చంపేశారా..?

మరోవైపు సాయి కృష్ణను పోలీసులే చంపేశారని తల్లి ఆరోపిస్తున్నారు. కనీసం తమకు మృతదేహాన్ని అయినా అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా డైరెక్ట్‌గా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. పోలీసులే సాయికృష్ణను టార్చర్ చేసి చంపేశారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా సాయికృష్ణ మిస్సింగ్‌పై సీఎం చంద్రబాబు హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీజీపీ నుంచి వివరణ తీసుకుంటున్నారు.

Next Story