డైరెక్టర్ పా. రంజిత్ పై కేసు నమోదు

by Muthe.Rajitha |

ప్రముఖ తమిళ దర్శకుడు పా. రంజిత్ (Director P. Ranjith)పై కేసు నమోదు అయింది.

డైరెక్టర్ పా. రంజిత్ పై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ తమిళ దర్శకుడు పా. రంజిత్ (Director Pa Ranjith)పై కేసు నమోదు అయింది. నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "వెట్టువం"{(Vettuvam) చిత్ర షూటింగ్ సందర్భంగా ఆదివారం స్టంట్ మాస్టర్ ఎస్.మోహన్ రాజు (52)(Stunt Master S. Mohan Raju) గుండెపోటుతో మృతి చెందారు. అయితే చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వల్లే రాజు మృతి చెందాడని ఆరోపిస్తూ.. డైరెక్టర్ పా. రంజిత్ తోసహా మరో ముగ్గురిపై నాగపట్టణం జిల్లాలోని కీళైయూర్ పోలీసులు కేసు నమోదు చేసారు. నాగపట్నం పరిసర ప్రాంతాల్లో పలు ఛేజింగ్ సీన్లు షూట్ చేస్తుండగా.. స్టంట్ మాస్టర్ రాజుకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఆసుపత్రికి చేర్చే సమయానికే ఆయన ప్రాణాలు వదిలినట్టు వైద్యులు తెలిపారు.

Next Story