HYD: సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ

by Gantepaka Srikanth |

తెలుగు ఫిలిం ఛాంబర్‌(Telugu Film Chamber)ను చిత్ర పరిశ్రమకు సంబంధించి తప్ప, వేరే వాటికి ఉపయోగించకూడదని 'సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ' పేరుతో సోమవారం సినీ ప్రముఖులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

HYD: సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ఫిలిం ఛాంబర్‌(Telugu Film Chamber)ను చిత్ర పరిశ్రమకు సంబంధించి తప్ప, వేరే వాటికి ఉపయోగించకూడదని 'సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ' పేరుతో సోమవారం సినీ ప్రముఖులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనకు నటులు మురళీ మోహన్, నిర్మాత సురేష్ బాబు, శివాజీ రాజా, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, ఏడిద రాజా, బసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, నరసింహారావు, శివనాగేశ్వరరావు, చంటి అడ్డాల రవీంద్ర నాథ్ ఠాగూర్, మద్దినేని రమేష్ బాబు, కస్తూరి శ్రీనివాస్, జీవీ మోహన్, హేమ జిల్లోజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడారు. ఇక్కడి స్పేస్ పూర్తిగా చిత్రపరిశ్రమ అవసరాల కోసమే ఉపయోగపడాలని డిమాండ్ చేశారు.

Next Story