- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సారీ’ అని గట్టిగా చెప్పండి.. మీడియాపై సల్మాన్ మరోసారి ఫైర్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫొటోగ్రాఫర్లపై సీరియస్ అయిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: పలువురు సెలబ్రిటీలు మీడియా వాళ్లపై ఫైర్ అవుతూ కొన్ని సార్లు వార్తల్లో నిలుస్తున్నారు. సమయం, సందర్భంగా లేకుండా కొందరు ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుంటే వారిపై ఫైర్ అవుతూ నెట్టింట వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల కొందరు ఫొటోగ్రాఫర్లపై సీరియస్ అయిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఈవెంట్ కోసం వచ్చిన సల్మాన్‌కు ఈ విషయంలో సారీ చెప్పారు కెమెరామెన్లు. దీంతో సల్మాన్.. ‘సారీ గట్టిగా చెప్పండి.. వినిపించడం లేదు.. మరింత గట్టిగా’ అంటూ చెప్పిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. ఇటీవల సల్మాన్ తనకు తెలిసివాళ్లను పలకరించేందుకు హాస్పిటల్‌కు వెళ్లాడు. ఆయన రాకను గమనించిన కొందరు కెమెరామెన్లు సల్మాన్‌ను ఫొటోలు తీస్తూ.. ‘మాతృభూమి’ సినిమా అప్డేట్ ఇవ్వాలంటూ కోరారు. దీనిపై స్పందించిన సల్మాన్ ‘మీకేమైనా పిచ్చా.. సినిమా అప్డేట్ ముఖ్యమా.. మనిషి ప్రాణాలు ముఖ్యమా.. ఏ టైమ్‌లో ఎలా స్పందించాలో కూడా తెలియదా’ అంటూ ఫైర్ అయ్యాడు. దీని కోసమే ఆ కెమెరా మెన్లు సారీ చెప్పగా.. ఇంకాస్త గట్టిగా సారీ చెప్పండి అంటూ సల్మాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. మద్ధతుగా నిలుస్తున్నారు నెటిజన్లు.






