- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bunny Vasu: 49 రూపాయలకే ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నాను
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ… కేవలం 49 రూపాయల అడ్వాన్స్‌కే ఆర్య సినిమా థియేటర్ హక్కులను నిర్మాత దిల్ రాజు తనకు ఇచ్చారని వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘బైకర్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నిన్న ఘనంగా విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ విడుదల కోసం ప్రత్యేకంగా ఓ ఈవెంట్ నిర్వహించగా దానికి చిత్రబృందంతో పాటు ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ… “నేను నిర్మాతగా ఈ స్థాయిలో ఉండడానికి దిల్ రాజు గారే కారణం. ఆయన లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు.
కెరీర్ ప్రారంభంలో ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ‘ఆర్య’ సినిమా థియేటర్ హక్కులను కేవలం 49 రూపాయల అడ్వాన్స్‌కే నాకు ఇచ్చారు. ఇలా చాలా విషయాల్లో నా ఎదుగుదలకు ఆయన కృషి చేశారు” అని చెప్పుకొచ్చారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఘిబ్రాన్ సంగీతం అందించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
బైక్ రేసింగ్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటివరకు పెద్దగా సినిమాలు రాకపోవడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నిన్న విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ… “ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఏప్రిల్ 3న మళ్లీ కలుద్దాం” అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ‘నారి నారి నడుమ మురారి’ విజయంతో మంచి జోష్‌లో ఉన్న శర్వానంద్ ‘బైకర్’ చిత్రంతో కూడా మరో విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.






