- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని కోట్లు ఖర్చు చేస్తే తప్ప చిన్న సినిమా వస్తుందని కూడా ఎవరికీ తెలియదు.. బన్నీ వాసు
తాజాగా బన్నీ వాసు మాట్లాడుతూ... ఈ రోజుల్లో ఓ చిన్న సినిమాకైనా సరే పబ్లిసిటీ కోసం ఒకటి నుండి ఒకటిన్నర కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. లేదంటే సినిమా వచ్చే విషయం కూడా ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బన్నీ వాసు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించి వాటిలో అనేక మూవీలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఈ నిర్మాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో సినిమాను తీయడం ముఖ్యం కాదు, దానిని సరైన పద్ధతిలో పబ్లిసిటీ చేయడం ముఖ్యం. అలాగే ఒక చిన్న చిత్రానికి సరైన రీతిలో పబ్లిసిటీ చేయాలంటే ఎంత ఖర్చవుతుంది అనే దానిపై ఈయన స్పష్టమైన సమాచారం ఇచ్చాడు.
తాజాగా బన్నీ వాసు మాట్లాడుతూ... మూవీ పూర్తయిన తర్వాత దాన్ని పక్కా ప్రణాళికతో పబ్లిసిటీ చేయాలి. ఈ రోజుల్లో తక్కువ బడ్జెట్ సినిమా అయినా సరే ఒకటి రాబోతుందని తెలియాలంటే దానికి పబ్లిసిటీ కంపల్సరీ. చిన్న మూవీ అయినా సరే వస్తుందని జనాలకు తెలియాలంటే ఒకటి నుండి ఒకటిన్నర కోటి వరకు ఖర్చు అవుతుంది. అది కూడా భారీ స్థాయిలో పబ్లిసిటీ జరగదు. కేవలం అలా అలా జరుగుతుంది. అందులోని కంటెంట్తో ప్రేక్షకులను మెప్పించగలిగినట్లయితే దాని రీచ్ మరింతగా పెరుగుతుంది.
కేవలం డబ్బు మాత్రమే ఖర్చు చేసినా పబ్లిసిటీ జరుగుతుందనేది చెప్పలేం. అందులోని కంటెంట్ కూడా చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ఆ చిత్రంలో ప్రేక్షకులను అలరించే సత్తా ఉంటే దాన్ని మనం సరైన పద్ధతిలో వినియోగించుకొని పబ్లిసిటీ చేసినట్లయితే కాస్త తక్కువ ఖర్చులో జనాలకు ఓ సినిమా వస్తుందని, దాన్ని చూడాలనే ఆసక్తిని రేకెత్తించవచ్చు. అదే కరెక్ట్ పద్ధతిలో వెళ్ళనట్లయితే ఖర్చు పెరిగినా జనాలకు ఆ ప్రోడక్ట్ పై ఆసక్తి కలిగే అవకాశం ఉండదని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.






