- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bunny Vasu: అరవింద్ గారి తిట్లకు భయపడి ఈవెంట్లకు రావడం మానేశా
బన్నీ వాసు మాట్లాడుతూ… గతంలో చాలా ఈవెంట్లకు హాజరయ్యేవాడినని, కానీ ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్ గారి తిట్లకు భయపడి ఏ సినిమా ఫంక్షన్‌కీ వెళ్లడం లేదని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బన్నీ వాసు ఒకరు. ఈయన ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఎక్కువ శాతం స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా రూపొందిన ‘డెకాయిట్’ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఈ మూవీ బృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, నాగ్ అశ్విన్, బన్నీ వాసు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్‌లో బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. ఆయన మాట్లాడుతూ… గతంలో వరుసగా చాలా ఈవెంట్లకు హాజరయ్యేవాడినని, కానీ ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్ గారి తిట్లకు భయపడి ఏ సినిమా ఈవెంట్‌కి వెళ్లడం లేదని అన్నారు. అయితే ఈ సినిమాకి ఏదో విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో తానే ఉదయాన్నే శేష్‌కు ఫోన్ చేసి ఈవెంట్‌కు వస్తానని చెప్పానని తెలిపారు. అలాగే ఈ సినిమా తాను చూశానని, 200 రూపాయలు పెట్టి చూసే ప్రతి ప్రేక్షకుడికి ఇది తప్పకుండా విలువైన అనుభవం ఇస్తుందని శేష్‌తో చెప్పానని, సినిమా అద్భుతంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.






