శ్రీతేజ్ ఆరోగ్యం కోసం రూ.3.20కోట్లు ఖ‌ర్చు చేశారు.. బ‌న్నీ వాసు షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

పుష్ప థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగి నేటితో స‌రిగ్గా ఏడాది పూర్తైంది. ఈ తొక్కిస‌లాటలో శ్రీతేజ్ అనే అబ్బాయి తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

శ్రీతేజ్ ఆరోగ్యం కోసం రూ.3.20కోట్లు ఖ‌ర్చు చేశారు.. బ‌న్నీ వాసు షాకింగ్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: పుష్ప థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగి నేటితో స‌రిగ్గా ఏడాది పూర్తైంది. ఈ తొక్కిస‌లాటలో శ్రీతేజ్ అనే అబ్బాయి తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం శ్రీతేజ్ ఆస్ప‌త్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటి వ‌ద్దే ఉంటున్నా పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో చికిత్స కొన‌సాగుతోంది. అయితే శ్రీతేజ్ తండ్రి త‌న కుమారుడి చికిత్స‌కు నెల‌కు రూ.1.50ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతున్నాయ‌ని కానీ అల్లు అర్జున్ టీమ్ ను సంప్ర‌దించినా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని చెప్పాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ వివాదంపై టాలీవుడ్ నిర్మాత బ‌న్నీ వాసు తాజాగా స్పందించారు. అల్లు అర్జున్ టీమ్ శ్రీతేజ్ ఆరోగ్యం కోసం మొత్తం రూ.3 కోట్ల 20ల‌క్ష‌ల 40వేలు ఖ‌ర్చు చేసింద‌ని చెప్పారు. అందులో రూ.1 కోటి 5ల‌క్ష‌ల‌ను ఫిక్స్డ్ డిపాజిట్ చేసింద‌న్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయ‌గా వ‌చ్చిన రూ.17ల‌క్ష‌ల‌ను కూడా బాధితుడికే ఇచ్చార‌న్నారు. ఇటీవ‌లే రూ.76 ల‌క్ష‌ల ఆస్ప‌త్రి బిల్ ను క్లియ‌ర్ చేసిన‌ట్టు తెలిపారు. ఎలాంటి స‌మ‌స్య ఉన్నా శ్రీతేజ్ తండ్రి వ‌చ్చి త‌మ‌ను క‌ల‌వ‌చ్చ‌ని అన్నారు. ఎమైనా ఖ‌ర్చు అయినా తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story