Allu Arjun: ఒకే పెళ్ళిలో బన్నీ, చిరు.. వైరల్ అవుతున్న ఫొటోలు

by Phanindra |   (  Updated:2024-12-09 07:33:14  IST  )

చిరంజీవి( Chiranjeevi) , అల్లు అరవింద్ ఫ్యామిలీలు ఓ పెళ్ళిలో సందడీ చేశారు

Allu Arjun: ఒకే పెళ్ళిలో బన్నీ, చిరు..  వైరల్ అవుతున్న ఫొటోలు
X

దిశ,వెబ్ డెస్క్ : అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య కొంత కాలం నుంచి గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్( Allu Arjun), వైసీపీ తరపున ప్రచారం చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అప్పటి నుంచి బన్నీ ని విమర్శించడం మొదలు పెట్టారు. ఇది మాత్రమే కాకుండా, నటుడు నాగబాబు కూడా పోస్టులు పెడుతూ ఉండటంతో అల్లు అర్జున్ ని మెగా ఫ్యాన్స్ లో కొందరు అన్ ఫాలో కొట్టడం మొదలు పెట్టారు.

అయితే చిరంజీవి( Chiranjeevi) , అల్లు అరవింద్ ఫ్యామిలీలు ఓ పెళ్ళిలో సందడీ చేశారు. సంజన బీరపల్లి అనే అమ్మాయి పెళ్ళికి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఇద్దరూ కూడా వెళ్ళారు. పెళ్లి కూతురు తండ్రి వీరిద్దరికీ మంచి స్నేహితుడిని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వారు ఈ పెళ్ళికి హాజరయ్యారు.

ఈ రెండు ఫ్యామిలీ మెంబెర్స్ పెళ్లికి అయితే హాజరయ్యారు కానీ, కలిసి ఎక్కడా కూడా ఫొటోలు దిగలేదు. పెళ్లిలో అల్లు అర్జున్, చిరు మాట్లాడుకునే ఉంటారని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ ఫొటోలను సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ షేర్ చేసింది. ఇక రెండు ఫ్యామిలీలు ఒకే పెళ్ళిలో కలవడంతో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story