Prabhas: ప్రభాస్ అభిమానులకు బంపర్ ఆఫర్.. మూవీ మేకర్స్ ట్వీట్ వైరల్

by Hamsa |
Prabhas: ప్రభాస్ అభిమానులకు బంపర్ ఆఫర్.. మూవీ మేకర్స్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: చాలామందికి సినిమాల్లో నటించే ఆసక్తి ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే తమ టాలెంట్‌తో అదృష్టాన్ని దక్కించుకుంటుంటారు. అయితే ఇంతకుముందు చాలా మంది సినీ సెలబ్రిటీలు తాము ఎంత కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారో వివరించారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు లేకుండా మూవీ మేకర్స్ తమ సినిమాల్లో నటించేందుకు నటీనటులు కావాలని సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ కొత్త నటీనటులకు అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)ను ఒక్కసారి కలిస్తే చాలు అనుకుంటారు. కానీ స్పిరిట్ మూవీ మేకర్స్ ఏకంగా ఆయనతో నటించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

‘‘స్పిరిట్‌(Spirit)లో నటించే అవకాశం అన్ని వయసుల వారికి కల్పిస్తున్నాం. కానీ థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు మాత్రమే అందుకు అర్హులు. ఒక హెడ్ షాట్ షొతోతో పాటు పర్సనల్ షాట్ ఫొటో కూడా జత చేయండి. మీ వివరాలను spirit. bhadrakalipichtures@gmail. comకి పంపండి. అలాగే ఇంట్రడక్షన్ వీడియోను రికార్డ్ చేసి పైన ఇచ్చిన జీ మెయిల్ ఐడికి పంపాలి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇంట్రెస్ట్ ఉన్నవారంతా ప్రభాస్ నటించే చాన్స్ వస్తుందని మెయిల్స్ చేస్తున్నారు. కాగా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’(Spirit). ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed