అభిమానులకు బంపర్ ఆఫర్.. ఫరియాను కలుసుకోవాలనుకునే వారికి ఇదే మంచి చాన్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-06 14:19:39  IST  )

నాటకరంగంలో బాల బాలికల ప్రతిభను పెంపొందించేందుకు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో.. ప్రముఖ నటనా శిక్షణ సంస్థ ‘నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా’ హైదరాబాద్‌ లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవాన్ని నిర్వహించబోతోంది.

అభిమానులకు బంపర్ ఆఫర్.. ఫరియాను కలుసుకోవాలనుకునే వారికి ఇదే మంచి చాన్స్!
X

దిశ, సినిమా: నాటకరంగంలో బాల బాలికల ప్రతిభను పెంపొందించేందుకు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో.. ప్రముఖ నటనా శిక్షణ సంస్థ ‘నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా’ హైదరాబాద్‌ లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవాన్ని నిర్వహించబోతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah), ప్రముఖ నటుడు అనీష్ కురువిల్ల(Anish Kuruvilla), డైరెక్టర్లు వినయ్ వర్మ(Vinay Verma), వెంకట్ గౌడ, రచయిత ఆకెళ్ళ శివ ప్రసాద్(Akella Siva Prasad) హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కోల్ కతా, భోపాల్, కేరళ ప్రాంతాల నుంచే కాకుండా నేపాల్, జపాన్ తదితర దేశాల్లోని కళాకారులు, నాటక బృందాలు సైతం పాల్గొంటున్నాయి. అయితే ఫరియాను కలుసుకోవాలనుకునే వారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.

రవీంద్రభారతి ఆడిటోరియంలో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఈ కార్యక్రమం జరగనుండగా.. థియేటర్, స్టోరీ టెల్లింగ్, నాటక ప్రదర్శనలతో చిన్నారులను అలరించే ఓ అద్భుతమైన వేదికను అందించేందుకు నిర్వాహకులు సంసిద్ధమయ్యారు. కొత్తతరం కళాకారుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలను పెంపొందించే ఈ వేదికపై వీక్షకులను మంత్రముగ్ధులను చేసే నాటకాలు ప్రదర్శితం కానున్నాయి. నాటక ప్రదర్శన కళలను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా ఈ ఈవెంట్‌ ను మరింత విజయవంతం చేసేందుకు తనవంతు కృషి చేస్తోంది. ‘స్వీయ వ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, కళలపై పట్టు సాధించడానికి నాటక రంగం ఓ శక్తివంతమైన సాధనం. విభిన్న సంస్కృతుల నుంచి యువ కళాకారులను ఓ చోట చేర్చడం ద్వారా కొత్తతరం నాటక ప్రేమికులను ప్రోత్సహించాలని భావిస్తున్నాం.’ అని నిర్వాహక బృందం ప్రతినిధి దేవికాదాస్ పేర్కొన్నారు.

Next Story