- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుల్లిరాజా మజాకా.. ఈ ఏడాది ఎన్ని సినిమాల్లో నటిస్తున్నాడో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
విడుదలకు సిద్ధంగా ఉన్న నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒకరాజు సినిమాలోనూ రేవంత్ నటించాడు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తన కెరీర్ గురించి కీలక విషయాలు పంచుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: గతేడాది విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లి రాజు పాత్రతో రేవంత్ అనే కుర్రాడు అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది సంక్రాంతికే కాకుండా ఈ ఏడాది సంక్రాంతికి కూడా రేవంత్ సత్తాచాటాడు. చిరంజీవి హీరోగా నటించిన మనశంకరవరప్రసాద్ గారు సినిమాలో నటించి మరోసారి థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు విడుదలకు సిద్ధంగా ఉన్న నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒకరాజు సినిమాలోనూ రేవంత్ నటించాడు.
కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తన కెరీర్ గురించి కీలక విషయాలు పంచుకున్నాడు. అన్ని సినిమాల్లో ఒకేలా కనిపించకూడదని కాస్త డిఫరెంట్ గా ఉండాలని డైట్ చేస్తున్నట్టు చెప్పాడు. అందుకే సన్నబడ్డానని అన్నాడు. అంతే కాకుండా ఈ ఏడాది చాలా బిజీగా ఉన్నానని పది సినిమాల్లో నటించానని చెప్పాడు. ఇండస్ట్రీలో అందరూ చిరంజీవితో నటించాలని అనుకుంటారని కానీ అందరికీ ఆ అవకాశం రాదన్నాడు. కానీ గతేడాది తాను చిరంజీవి సినిమాలో మాత్రమే నటించానని అన్నాడు. అది తన జీవితంలోనే సంతోషపడిన సందర్భం అని చెప్పాడు.






