- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్ది కోసం చెన్నై వెళ్లిన బుచ్చిబాబు.. అసలేం జరుగుతోంది?
పెద్ది సినిమా పనుల నిమిత్తం చెన్నై వెళ్లిన బుచ్చిబాబు.

దిశ, వెబ్ డెస్క్: ఒక్క సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో బుచ్చిబాబు సనా ఒకరు. ‘ఉప్పెన’ మూవీతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న ఆయన, ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా సినిమాను అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో బుచ్చిబాబు సనా రాత్రింబగళ్లు కష్టపడుతున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా సినిమా పనుల నిమిత్తం ప్రస్తుతం ఆయన చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి పనులన్నీ పూర్తి చేసుకున్న అనంతరం తిరిగి హైదరాబాద్ చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాంధు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కీలేరు నిర్మిస్తున్నారు.






