Peddi Movie: కేవ‌లం 6 రోజులే.. 'పెద్ది'పై బుచ్చిబాబు కీల‌క ప్ర‌క‌ట‌న

by velandi.Saikiran |   (  Updated:2026-04-21 12:45:05  IST  )

మరో ఆరు రోజుల్లో పెద్ది సినిమా షూటింగ్ పూర్తికానుందని స్పష్టం చేశారు బుచ్చిబాబు.

Peddi Movie: కేవ‌లం 6 రోజులే.. పెద్దిపై బుచ్చిబాబు కీల‌క ప్ర‌క‌ట‌న
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్... ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. అయితే అలాంటి రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు కీలక ప్రకటన చేశారు. మరో ఆరు రోజుల్లో పెద్ది సినిమా షూటింగ్ పూర్తికానుందని స్పష్టం చేశారు. సెట్ లో రామ్ చరణ్ తో తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేశారు. రామ్ చరణ్ ది మోస్ట్ ఇన్ స్పైరింగ్ క్యారెక్టర్ అంటూ ప్రశంసించారు. కాగా ఈ సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ పెండింగ్ లో ఉన్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

కానీ అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్టెప్పులు వేసే హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు చిత్ర బృందం ప్రకటించలేదు. సంయుక్త మీన‌న్ ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయ‌నున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. కాగా ఈ సినిమా జూన్ మాసంలో రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉండగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా... బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్‌ హీరోయిన్ గా మెరువనున్నారు.

మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా స‌మంత‌..లిస్ట్ లో ప్ర‌భాస్‌

Next Story