- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సీన్స్ యాడ్ చేయడంతో జాన్వీ రేంజ్ మారిపోతుంది.. డైరెక్టర్ బుచ్చిబాబు సానా కామెంట్స్‌తో పెద్దిపై మరింత హైప్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’.

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించగా.. దర్శకుడు బుచ్చిబాబు సానా సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఈ మేరకు ఐటెమ్ సాంగ్‌పై వస్తున్న విమర్శలపై మాట్లాడుతూ.. ‘ఐటెమ్ సాంగ్‌ను ఐటెమ్ సాంగ్‌లాగే ఆస్వాదించాలి. విమర్శగానీ, ఆరోపణగానీ నిర్దిష్టంగా ఉండాలి. ప్రత్యేకంగా ఎజెండా పెట్టుకుని మాట్లాడితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిజాయితీగా అడిగిన వారికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. అలాగే ‘పెద్ది’ సినిమాలో కొన్ని ఎటిట్ చేశాం. ఇందులో మొత్తం మూడు సన్నివేశాలు జోడించాం. హీరోయిన్‌కు సంబంధించిన మూడు సీన్లు, అలాగే జగపతిబాబు గారికి ఒక సీన్ ఉంటుంది. మిస్ అయిన అంశాలన్నీ అందులో ఉంటాయి. జాన్వీ పాత్రకు సంబంధించి మరో రెండు సన్నివేశాలు ఉన్నాయి. అవి చూసిన తర్వాత ప్రేక్షకులు ఆ పాత్రకు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. బుధవారం నుంచి ఆ సన్నివేశాలు జోడిస్తాం. దాంతో జాన్వీ పాత్ర మరో స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను’ అంటూ తెలిపారు.






