‘పెద్ది 2’పై అప్‌డేట్ ఇచ్చిన బుచ్చిబాబు

by Pulgam srinivas |

‘పెద్ది’ చిత్రానికి సీక్వెల్ ఉండదని దర్శకుడు బుచ్చిబాబు సనా స్పష్టం చేశారు.

‘పెద్ది 2’పై అప్‌డేట్ ఇచ్చిన బుచ్చిబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ‘ఉప్పెన’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బుచ్చిబాబు సనా, తాజాగా రామ్ చరణ్ హీరోగా ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో బుచ్చిబాబు వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ‘పెద్ది’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? అనే ప్రశ్న ఎదురైంది. ఇటీవల చాలా సినిమాలు రెండో భాగానికి లీడ్ ఇస్తూ ముగుస్తున్న నేపథ్యంలో, ‘పెద్ది’ కూడా అదే తరహాలో ఉంటుందా? లేక ఒకే భాగంతో ముగుస్తుందా? అని అడిగారు.

దీనికి స్పందించిన బుచ్చిబాబు, ‘పెద్ది’ కథను ఒకే భాగంగా చెప్పాలనే ఉద్దేశంతో రూపొందించామని, అలా చెప్పినప్పుడే కథ మరింత బాగా వర్కౌట్ అవుతుందని భావించామని తెలిపారు. ఈ చిత్రానికి ఎలాంటి సీక్వెల్ ప్లాన్ చేయలేదని, ఒకే భాగంతో కథ పూర్తవుతుందని స్పష్టం చేశారు. దీంతో ‘పెద్ది’ చిత్రానికి రెండో భాగం ఉండదనే అంశంపై అభిమానులకు స్పష్టత వచ్చినట్లైంది. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకుని ఈ చిత్రం విజయాన్ని అందుకుంటుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Next Story