- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Peddi: బ్యాట్ తో దిగిపోయిన చరణ్..బుచ్చిబాబు ట్రీట్ మాములుగా లేదుగా
క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. అయితే ఇవాళ దీపావళి నేపథ్యంలో బుచ్చిబాబు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పెద్ది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్నారు. విజయ్ సేతుపతి, జగపతిబాబు, శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలలో కనిపిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. అయితే ఇవాళ దీపావళి నేపథ్యంలో బుచ్చిబాబు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. 15 నుంచి 20 రోజుల్లో ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అద్భుతంగా మ్యూజిక్ అందించాడని తెలిపారు. అలాగే క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఉన్న చరణ్ పోస్టర్ ను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. క్లిక్






