రామ్ చ‌ర‌ణ్ తో మ‌రో సినిమా...బుచ్చిబాబు ట్వీట్ వైర‌ల్

by velandi.Saikiran |

రామ్ చరణ్ తో దర్శకుడు బుచ్చిబాబు మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది.

రామ్ చ‌ర‌ణ్ తో మ‌రో సినిమా...బుచ్చిబాబు ట్వీట్ వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. RRR లాంటి సినిమా చేసి పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. అయితే అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చ‌ర‌ణ్ తో మ‌రో సినిమాకు బుచ్చిబాబు స్కెచ్ !

బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ పెద్ది సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే రామ్ చరణ్ తో మరో సినిమా కావాలంటూ బుచ్చిబాబు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తాజాగా రామ్ చరణ్ తో ఫోటో షూట్ కు సంబంధించిన వీడియోను ఎస్క్వైర్ ఇండియా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇక దీనిపై బుచ్చిబాబు స్పందించారు. సార్.. తనకు మరోసారి అవకాశం ఇవ్వండి అంటూ వెల్లడించారు. దీంతో రామ్ చరణ్ తో దర్శకుడు బుచ్చిబాబు మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. పెద్ది సినిమా పెద్ద హిట్ అవుతే వీరి కాంబినేషన్ లో మరో సినిమా రావడం గ్యారెంటీ అని మెగా అభిమానులు అంటున్నారు.

Next Story