- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుచ్చిబాబుకు బంపర్ ఆఫర్.. ఇక భారీ హిట్ పడ్డట్టే?
టాలీవుడ్ కొత్త దర్శకుడు బుచ్చిబాబుకు ( Bucchi Babu) అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కొత్త దర్శకుడు బుచ్చిబాబుకు ( Bucchi Babu) అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో ( Ram Charan) సినిమా చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబుకు మరో అవకాశం వచ్చిందని ప్రచారం జోరుగా సాగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుతో ( Mahesh Babu) కొత్త సినిమా చేయబోతున్నాడట బుచ్చిబాబు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే అనే సినిమాకు AD గా పనిచేసిన సంగతి తెలిసిందే. సుకుమార్ ( Sukumar) శిష్యుడు కావడంతో ఆ అవకాశం వచ్చింది. అయితే... ఉప్పెన సినిమా తీసిన తర్వాత వెంటనే మహేష్ బాబును కలిశారట బుచ్చిబాబు. మంచి కథ ఉంటే చెప్పు సినిమా చేద్దామని అప్పుడే మహేష్ బాబు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే... ఓ యాక్షన్ డ్రామా కథ రాసుకోవచ్చాడట బుచ్చిబాబు. నిత్యం తన దగ్గర చాలా కథలు ఉన్నాయని బుచ్చిబాబు చెబుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు కొత్త స్టోరీని చెప్పాడట. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. అటు రామ్ చరణ్ తో బుచ్చిబాబు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత... వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ తో పెద్ది మూవీ చేస్తున్నాడు టాలీవుడ్ కొత్త దర్శకుడు బుచ్చిబాబు.






