Daaku Maharaj: 'డాకు మహారాజ్' థియేటర్ లో థమన్‌ బీజీఎంకు పగిలిపోయిన సౌండ్ బాక్సులు.. 15 నిముషాలు సినిమా నిలిపివేత

by Phanindra |

థియేటర్ యాజమాన్యం 15 నిముషాల వరకు మూవీని నిలిపివేశారు.

Daaku Maharaj:  డాకు మహారాజ్ థియేటర్ లో థమన్‌ బీజీఎంకు పగిలిపోయిన సౌండ్ బాక్సులు.. 15 నిముషాలు సినిమా నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన డైరెకర్ బాబీ దర్శకత్వంలో మన ముందుకొచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'డాకూ మహారాజ్'. నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. సినిమాలో బాలయ్య ఎప్పటిలాగే తన పవర్ ఫుల్ డైలాగ్స్ చించేసాడని అభిమానులు చెబుతున్నారు. థమన్‌ బీజీఎం అయితే దంచి కొడుతోంది .. మాములుగా లేదు.. ఓ రేంజ్ లో ఉంది.. బాక్సులు కూడా బద్దలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, తాజాగా ఈ మూవీ ఆడుతున్న థియేటర్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూవీలో థమన్ ఇచ్చిన బీజియంకి స్పీకర్ బాక్సులు పగిలిపోయాయట. దీంతో, థియేటర్ యాజమాన్యం 15 నిముషాల వరకు మూవీని నిలిపివేశారు. ఈ ఘటన ఏపీ రాయలసీమలోని ఆళ్లగడ్డ లో ఉన్న రామలక్ష్మి థియేటర్ లో జరిగింది. ఈ ఒక్క చోటే కాకుండా .. కొన్ని థియేటర్లలో 'డాకు మహారాజ్' సౌండ్ కు స్పీకర్ బాక్సులు పగిలిపోయానని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.

Next Story