- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గుర్రం పాపిరెడ్డి’పై బ్రహ్మానందం సెన్సేషనల్ కామెంట్స్
‘గుర్రం పాపిరెడ్డి’ లాంటి కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఆదరించి సపోర్ట్ చేయాలన్నారు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం. ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌కు హాజరైన ఆయన..‘ఈ సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. కథను ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించాను.

దిశ, సినిమా : ‘గుర్రం పాపిరెడ్డి’ లాంటి కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఆదరించి సపోర్ట్ చేయాలన్నారు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం. ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌కు హాజరైన ఆయన..‘ఈ సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. కథను ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించాను. ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఈ చిత్రాన్ని ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా కొత్త పద్ధతిలో దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించాడు. యోగి బాబు పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది. అతనితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉండవు కానీ యోగిబాబు ఈ మూవీలో హిలేరియస్ కామెడీ చేశాడు. జీవన్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వశీధర్ కోసిగి తమ పాత్రల్లో బాగా నటించారు. దర్శకుడు వారితో అలా పర్ఫార్మ్ చేయించారు. నేను సెట్‌లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్స్ ఓల్డ్ గెటప్‌లో వచ్చి కలిశారు. ఎవరో బయటవారు షూటింగ్ చూసేందుకు వచ్చారని అనుకున్నా. ఇలా డిఫరెంట్ గెటప్స్‌లో హీరో నరేష్, హీరోయిన్ ఫరియా ఆకట్టుకుంటారు. ప్రొడ్యూసర్స్ సినిమా బాగా వచ్చేలా రాజీ పడకుండా నిర్మించారు. ఈ నెల 19న ‘గుర్రం పాపిరెడ్డి’ రిలీజ్ అవుతోంది. కొత్త వాళ్లు చేసిన ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. మరిన్ని మంచి చిత్రాలు వారు చేసే అవకాశం కలుగుతుంది’ అని సూచించారు. కాగా నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు.






