Brahmamudi: శ్రుతి ఎంట్రీతో కళావతి డమాల్..

by Phanindra |   (  Updated:2024-12-31 08:13:39  IST  )

బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

Brahmamudi: శ్రుతి ఎంట్రీతో కళావతి డమాల్..
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

కావ్య, రాజ్ లు పెద్ద ప్రాబ్లెమ్ లో ఉన్నారన్న విషయం మనకీ తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించడానికి రాజ్, కావ్య హెల్ప్ తీసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే కట్టుకున్న మొగుడికి రూ. 5 కోట్లు ఇస్తుంది. ‘ఎలా ఉంది నేను చేసిన పని?’ అంటూ కావ్య రాజ్ వైపు చూస్తుంటుంది. ‘ రూ. 5 కోట్లు ఇప్పిస్తే ఈయనేంటి సీరియస్‌గా చూస్తున్నాడు?’ అని కావ్య మనసులో అనుకుంటుంది. ‘ వారంలో మనం అనుకున్న పనులు స్టార్ట్ అవుతాయి కదా అని జగదీష్ అంటాడు.

‘అవును సార్ అవుతుంది’ అని రాజ్ అంటాడు. సరే అయితే నేను ఇంకా వెళ్తాను అని జగదీష్ లేవగానే.. హ రాజ్.. ‘పదండి సార్’ అని క్యాబిన్ గుమ్మం వరకు వెళ్తాడు. వెనక్కి తిరిగి.. ‘కళావతీ..’ గట్టిగా హాగ్ చేసుకుని, గుండ్రంగా తిప్పడం మొదలుపెట్టడు. ‘ఏమండీ ఆపండి.. నాకు బాగా కళ్లు తిరుగుతున్నాయి’ అని అరుస్తున్నా కూడా వినిపించుకోడు. థాంక్యూ సో మచ్ కళావతీ, రూ. 5 కోట్లు చెక్ వచ్చేసింది.. నువ్వు సూపరో సూపర్’ అంటూ కావ్యను సంతోషంతో తిప్పుతూ ఉండగా .. శ్రుతి డోర్ వరకు వచ్చి.. ‘మేడమ్’ అంటూ వాళ్లిద్దరినీ చూసి షాక్ అవుతుంది. వెంటనే రాజ్.. శ్రుతిని చూసి.. కావ్యను కిందకు పడేస్తాడు.. మళ్ళీ పైకి ఏం తెలియనట్లుగా నటిస్తూ ఉంటాడు. తల దించుకుని టేబుల్ పైనున్న డిజైన్స్‌ని చూస్తూ ఉంటాడు. ‘ఏంటండీ మీరు.. ఆనందం వస్తే ఎత్తుకుని తిప్పుతారు.. లేదంటే ఎవరైనా వస్తే పడేస్తారా?’ అంటుంది కావ్య కోపంగా.. అంటుంది. వెంటనే రాజ్.. శ్రుతిని.. ‘నీకు అసలు బుద్ధి ఉందా.. మేడమ్ పడిపోవడానికి నువ్వే కారణం.. మేమిద్దరం క్యాబిన్‌లో ఉండగా అపాయింట్‌మెంట్ తీసుకుని రావాలని తెలియదా? అని అంటూ రాజ్ అంటాడు.

Next Story