- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brahmamudi: అప్పూ కూడా అనామికలా చేస్తుందా ఏంటి?
నీకు నా మీద నమ్మకం లేదా.. నువ్వు , నన్ను అనుమానిస్తున్నావా?

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
‘అదిగో నీకు అది కూడా గుర్తు లేదు.. అయిపోయింది.. మొత్తం అయిపోయింది. ఇంక నేను కూడా యుద్దాలు చేయాలి. దుగ్గిరాల కుటుంబంలో మీ అన్నా తమ్ముళ్లు, మా అక్కా చెల్లెలతో ఆడుకోవాలని చూస్తున్నారా? నిజం చెప్పు?’ అని అప్పూ అంటుంది. హలో కొంచం తగ్గు .. ‘కుటుంబాన్ని మధ్యలోకి తీసుకురాకు.. పొట్టి నీకు దండం పెడతాను.. నువ్వేనా అసలు .. ఎప్పుడూ లేనిది ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్? అని కవి అంటాడు. హా చెప్పు ‘ఇంకెలా మాట్లాడాలి? మాట ఇచ్చి తప్పే వాళ్లతో నేను ఇలాగే మాట్లాడతా అని’ అప్పూ కోపంగా అంటుంది.
‘నిజం చెప్పు నువ్వు ఎక్కడ ఉన్నావ్.. అసలు నువ్వు హైదరాబాద్‌లో ఉన్నావా లేక చిన్న ఫ్యామిలీని మెయిటెన్ చేస్తున్నావా?’ అని అప్పూ అడుగుతుంది. ఆ మాటలకు కవి షాక్ అవుతాడు. ‘చెప్పు.. నేను చెప్పింది నిజమే కదా? లేక మెయిటెన్ చేస్తున్నావా అని ’ గట్టిగా అడుగుతుంది అంటుంది అప్పూ. ‘నేనా? చిన్న ఫ్యామిలీనా.. అసలేం మాట్లాడుతున్నావ్ నువ్వు .. ఉన్న ఫ్యామిలీకే దిక్కులేదు.. మళ్ళీ చిన్న ఫ్యామిలీ కూడానా? అంటే నీకు నా మీద నమ్మకం లేదా.. నన్ను నువ్వు అనుమానిస్తున్నావా?’ అని కవి కోపంగా అంటాడు. ‘ఏమో బాబు ఈ అబ్బాయిలను అస్సలు నమ్మలేము .. చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి..’ అని అప్పూ అంటుంది. ‘అప్పూ ప్లీజ్.. ఇంక ఆపు.. నీకు అక్కడ గ్యాప్ ఇచ్చారని నన్ను ఇలా గ్యాప్ లేకుండా ఆడేసికోకు' అని కవి అంటాడు.






