- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brahmamudi: కావ్యను, రాజ్ గదిలోకి తీసుకెళ్తాడా?
వంట గదిలో కావ్య నేల మీద పడుకుని ఉంటుంది..

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
వంట గదిలో కావ్య నేల మీద పడుకుని ఉంటుంది.. అర్థ రాత్రి అపర్ణా దేవి మంచి నీళ్ళ కోసం లేచి.. కావ్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక, వెంటనే ఆమెను నిద్ర లేపి .. బాగా తిడుతుంది. కావ్య నిద్ర మత్తులో ఉంటుంది. ఏమి మాట్లాడాలో తెలియక అలాగే చూస్తూ నిలబడి ఉంటుంది. అపర్ణకు చెప్పాలని ప్రయత్నించిన ఆమె వినకుండా అలాగే అరుస్తూ ఉంటుంది. రాజ్‌ని పిలుస్తుంది. రాజ్ పరుగున అక్కడికి వస్తాడు. ‘ఇది ఎవరు?’ అని అడుగుతుంది ఎవరేంటి మమ్మీ ‘కళావతి’ అని రాజ్ అంటాడు. ‘ఈ ఇంట్లో ఎందుకుంది?’ అని అపర్ణ అడుగుతుంది. ‘అంటే ఉండకూడదు అంటే ఇప్పుడే వాళ్ళ ఇంటికి పంపిచేద్దాం మమ్మీ’అని రాజ్ అంటాడు. ‘పళ్లు రాలగొడతాను’ పదే పదే ఆ మాట అంటే.. అని అంటుంది అపర్ణా దేవి.
రాజ్‌పై అపర్ణా దేవి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక్కడ ‘ఎందుకు ఉంది అని ఇంటికి పంపిస్తా అంటావా .. నీ తెలివి నా దగ్గర చూపించకు రాజ్? ఈ ఇంటికి నీ భార్య తిరిగి వచ్చిందన్న విషయం నీకు గుర్తుందా ?’ అని అంటుంది ‘కళ్లెదురుగా కనిపిస్తూ ఉంది కదా..ఇంకెందుకు గుర్తు పెట్టుకోవడం ’ అని అంటాడు రాజ్. ‘కనిపిస్తే.. నువ్వు చేసిందేంటి .. చాలా టైం అయింది .. ఇంత రాత్రి అయినా నీ గదికి రాకపోతే ఎక్కడ ఉందో కనుక్కోవాల్సిన అవసరం లేదా అని అడుగుతుంది అపర్ణాదేవి. ‘ఎవరిని అడగాలి? ఎందుకు అడగాలి ? నేనేం ఆమెను రమ్మనలేదు. వస్తే పొమ్మనలేదు’ అని అంటాడు రాజ్. ‘కావ్య నేల మీద పడుకుంది తెలుసా’ అని కిందకు చూపిస్తుంది అపర్ణా దేవి రాజ్‌కి. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.






