Brahmaji : అన్నం పెట్టినందుకు ఏకంగా ఆదర్శకుడు నన్ను హీరోను చేశాడు

by Pulgam srinivas |

బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ఒకరోజు నేను కృష్ణవంశీ గారికి భోజనం పెట్టించాను. అప్పటికి ఆయన రెండు రోజుల నుండి ఆకలితో ఉన్న విషయం నాకు తెలియదు. దాంతో ఆయన నన్ను ఆరోజు హీరోగా చేస్తానని అన్నారు... చేశారు అని బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు.

Brahmaji : అన్నం పెట్టినందుకు ఏకంగా ఆదర్శకుడు నన్ను హీరోను చేశాడు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బ్రహ్మాజీ ఒకరు. ఈయన చిన్న పాత్రలతో కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ముఖ్యపాత్రల్లో, మరికొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. రీసెంట్ టైంలో బ్రహ్మాజీ అనేక సినిమాల్లో నటిస్తున్నాడు. ఎక్కువ శాతం హాస్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తున్నాడు. తాజాగా ఈ నటుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా తనను హీరోగా చేసిన ఓ దర్శకుడి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా బ్రహ్మాజీ మాట్లాడుతూ... నేను పెద్దగా ఆలోచించకుండా దర్శకుడు కృష్ణ వంశీ గారికి ఒకరోజు భోజనం పెట్టించాను. అప్పటికి ఆయన రెండు రోజుల ఆకలితో ఉన్న విషయం నాకు తెలియదు. కృష్ణవంశీ గారు దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించక ముందు అనేక ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యాడు. దానితో ఆయన సరిగ్గా భోజనం కూడా చేసేవారు కాదు. అలాంటి సమయంలో ఆయనకు నేను భోజనం పెట్టించాను. దాంతో ఆయన ఏదో ఒక రోజు నిన్ను హీరోను చేస్తాను అన్నాడు.

ఇక ఆయన దర్శకుడు అయిన తర్వాత నాకు హీరోగా అవకాశం ఇచ్చాడు. అలాగే ఆయన దర్శకత్వంలో రూపొందిన ఎన్నో చిత్రాల్లో నాకు మంచి పాత్రలు ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమాల ద్వారా నాకు గొప్ప గుర్తింపు వచ్చింది. అలా ఒకరోజు నేను పెద్దగా ఆలోచించకుండా పెట్టించిన భోజనం వల్ల ఆయన నాతో ఎన్నో సినిమాలు చేశాడు అని బ్రహ్మాజీ తాజాగా చెప్పుకొచ్చాడు. బ్రహ్మాజీ, కృష్ణవంశీ కాంబినేషన్లో గులాబీ, సింధూరం, చంద్రలేఖ, నిన్నే పెళ్ళాడుతా, ఖడ్గం తదితర సినిమాలు వచ్చాయి.

Next Story